Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

దారిద్ర్యాలను దూరంచేసే కనకధారాస్తవం

బ్రహ్మచారిగా విధ్యాభ్యాసం చేస్తున్న శంకరాచార్యులవారు ఒకరోజు భిక్షార్థియై ఒకరోజు ఒక నిరుపేద ఇంటిముందు నిలబడి, భవతీ భిక్షాందేహి అని అడిగారట. పాపం దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న ఆఇల్లాలు ఇంటిముందుకొచ్చి యాచించిన వారికి ఏమీ ఇవ్వటానికి లేక బాధపడుతూ అంతావెదుకుతున్నది. అర్ధిని రిక్తహస్తాలతో పంపితే అది దోషమవుతుంది. అదితెలియక మనం యాచించిన వారిని కసురుకుంటాము. కానీ ధర్మంతెలిసిన ఆఇల్లాలు, ఇల్లంతావెదకగా ఎండిపోయిన ఒక ఉసిరికాయ మాత్రమే దొరికినది. ఎంతో ఆవేదనతో కుమిలిపోతూ, ఆ కాయనేతెచ్చి శంకరుల భిక్షాపాత్రలో వేసి కళ్ళలో నీరుకుక్కుకుంటూ నమస్కరించినదట. సర్వజ్ఞులైన ఆచార్యులవారి మనస్సు ఆతల్లి ధర్మనిష్ఠకు, వారిపేదరికపు బాధకు కరగిపోయినది. వెంటనే సకలసంపదలనొసగే ఆ మహాలక్ష్మీదేవిని స్తుతిస్తూ స్తోత్రం చేసారట. అండుకు మిగుల సంతోషించిన ఆజగన్మాత ప్రత్యక్షమై ఏమికావాలినాయనా అని అడిగినదట. అప్పుడు తల్లీ ఈ ఇల్లాలి దారిద్ర్యాన్ని తొలగించమని వారువేడుకొనగా, ఈ గృహిణీ పూర్వజన్మమున ఏ పుణ్యకార్యము చేయనందున నా అనుగ్రహము కలుగలేదు ఈమెపై అని తల్లిసెలవిచ్చినది. అప్పుడాయన ఈమె నాకిపుడొసగిన ఉసిరికాయ వలన వచ్చిన పుణ్యమును పరిగణించి కనికరించమని వేడగా ,ఆఇంటిలో బంగారపు వుసిరికాయలను కురిపించినది అమ్మ. అందువలనే ఈ స్తోత్రమునకు కనకధారా స్తవమని పేరు. ఇప్పటికీ దారిద్ర్య బాధతో కుమిలిపోతున్న వారెందరో ఈ స్తోత్రాన్ని జపించి తమ దరిద్రాలను దూరంచేసుకుంటున్నారు. నేను కూడా ప్రత్యక్షప్రమాణంగా కొందరిచేత పారాయ\ణం చేపించగా వారికి ఎంతో మంచి ఫలితాలు వచ్చాయి. లక్ష్మీదేవికి ఇష్టమయిన ఈ శ్రావణమాసములో ఈస్తోత్రాన్ని పఠించి ఆతల్లి కరుణను అందరూ పొందాలని కోరుకుంటున్నాను.


కనకధారాస్తవం

---- ----------- -----

వందే వందారు మన్దార మిందిరానంద కందలమ్
అమందానంద సందోహా బంధురం సిందురాననం
ఆజ్ఞమ్ హరే పులకభూషణ మాశ్రయంతీ
భృంన్గాన్గనేవ ముకులాభరణం తమాలం
అజ్ఞీ కృతాఖిల విభూతి రపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయా:

ముగ్ధా ముహర్విదధతీ వదనేమురారే
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా
సామే శ్రియం దిశతు సాగర సంభవాయా:

విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్ష
మానందహేతురధికం మురవిద్వషో..పి
ఈశన్నిషీదతు మయిక్షణ మీక్షణార్ధం
మిందీవరోదర సహోహోదరమిందిరాయ

ఆమీలితాక్ష మధిగమ్య ముదాముకుంద
మానందకందమనిమేష మనంగతంత్రం
ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయా:

కాలాంబుదాళిలలితోరసికైటబారే
ర్ధారార్ధరే స్పురతి యా తటిదన్గనేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తి
ర్భద్రాణిమేదిశతు భార్గవ నన్దనాయ

బాహ్యాంతరే మురజిత: శ్రితకౌస్తుభేయా
హారావళీవ హరినీలమయీ విభాతి.
కామప్రదా భగవతో.. పి కటాక్షమాలా
కళ్యాణమావహతుమే కమలాలయాయా :

ప్రాప్తం పదం ప్రథమత: ఖలుయత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాధిని మన్మథేన,
మియ్యాపతేత్తదిహ మందర మీక్షణార్ధం
మన్దాలసం చ మకరాలయ కన్యకాయా:

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుథారా
మస్మిన్నకిఞ్చన విహజ్ఞ్గ శిశౌ విషణ్ణే,
దుష్కర్మఘర్మ మపనీయ చిరాయుదూరం
నారాయణ ప్రణయనీ నయనాంబువాహ:
...
............ ........ ఈస్తోత్రము ఇంకా వున్నది .దీనిని తప్పులు లేకుండా ఇక్కడ చేయటానికి కొన్ని గుర్తులు లేనందున వ్రాయలేకపోతున్నాను. క్షమించగలరు. మీకు సమీపములోని పుస్తకాలషాపులో దొరుకుతుంది. లేదా ప్రామాణికమయిన ఏదన్న సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోగలరు. ఆతల్లి కరుణ మీపై వుండాలని కోరుకుంటున్నాను.
నిరాకరణ